Yoga at Golden Temple: సిక్కులకు పవిత్రమైన అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ఓ యువతి యోగా సాధన చేయడం వివాదాస్పదమైంది. అర్చనా మక్వానా అనే యువతి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న గోల్డెన్ టెంపుల్ ఆవరణలో ఆసనాలు వేసింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాట్నాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు
పంజాబ్‌లోని గురుద్వారాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు మృతి చెందాడు.
UK: ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూకేలో రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ బ్రిటన్ లోని భారత రాయబారిని గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యూకే స్కాట్లాండ్ ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారత రాయబారి దొరైస్వామిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు అడ్డుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పంజాబ్ తరన్ తరణ్‌లోని గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ పార్కింగ్ స్థలంలో ఓ బాంబు కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబును బయటకు తీశారు.