తెలుగుదేశం పార్టీ కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వరుసగా మూడు విడతల నుంచి టీడీపీ అభ్యర్ధులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. క్యాండిడేట్ ఎవరన్న దానితో సంబంధం లేదు. జస్ట్ గుంటూరు వెస్ట్ టీడీపీ టిక్కెట్ తెచ్చుకోగలిగితే చాలు.... ఎమ్మెల్యే అయిపోయినట్టే. దానికి చెక్ పెట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా... వర్కౌట్ కాలేదు. 2024లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా భావిస్తూ... మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ బరిలో దింపింది వైసీపీ.