Vidadala Rajini: గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే ఈ కుట్రకు దర్శకుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. అంతేకాకుండా.. నా మీద అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె వాపోయారు.…
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే…
Guntur Politics: జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు, బాపట్ల, గుంటూరుగా విడిపోయింది. దానికంటే ముందుగానే గుంటూరు, నరసరావుపే, బాపట్ల లోక్‌సభ పరిధిలో కమిటీలను విభజించేశాయి ప్రధాన పార్టీలు. ఈ మార్పులు.. చేర్పులు తర్వాత పార్టీ నేతల వైఖరిలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలిసి మెలిసి తిరిగిన నాయకుల మధ్య జిల్లాల విభజన పెద్ద రేఖే గీసిందట. పక్క జిల్లాకి వెళ్లాలంటేనే నాయకులు భయపడుతున్నారట. అక్కడికి వెళ్తే ఆ జిల్లా అధ్యక్షుడు…
ఆయన రాజకీయాలకు కొత్త. గెలిచాం కదా..! అంతా నాదే.. నేను చెప్పిందే ఫైనల్ అనుకున్నట్టున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అది ఓల్డ్ బ్యాచ్‌కు చిర్రెత్తించింది. ఇంకేం ఉంది గ్రూపు కట్టేశారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందట. రాజకీయాల్లో ఓనమాలు తెలియని తీరే ఎసరు పెట్టేలా ఉందా?గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. స్థానిక నేతల మధ్య విభేదాలు పీక్‌కు చేరాయి.…
గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయా? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన రచ్చలో.. ఎంపీ కూడా చేరారా? పంచాయితీ సీఎం దగ్గరకు చేరిందా? అసలు వినుకొండ వైసీపీలో ఏం జరుగుతుంది? వినుకొండ వైసీపీలో మొదట్లో అంతా బాగానే ఉందా?వినుకొండ.. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈ పేరే హాట్ టాపిక్. గత ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు గెలిచారు. మొదట్లో వినుకొండ వైసీపీలో అంతా బాగానే ఉన్నా.. కొద్ది…