అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలని ఇచ్చిన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉండడంతో, గుంటూరు కారం ఘాటుకి యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది. 24 గంటల్లో ఒక మట్టి తుఫానులా యూట్యూబ్ కి…
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్…
సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మాస్ స్ట్రైక్ మీకోసమే. మహేష్ నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వెంటనే హారిక హాసిని రిలీజ్ చేసిన వీడియో చూసేయండి. మీరు మహేష్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఈ నిమిషం నిడివి ఉన్న గ్లిమ్ప్స్ మీకోసం రిపీట్స్ వేసుకోండి. ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి, ఆయన సినిమాలు క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, భరత్ అనే నేను సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి, సర్కారు వారి పాట సినిమాతో ఓపెనింగ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు మహేష్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కలెక్షన్ల ట్రాకింగ్ ఉన్న ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు టాప్…
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే టాగ్, ఒకటే ట్రెండ్ నడుస్తోంది… ‘ఎస్ఎస్ఎంబీ 28’. మే 31న టైటిల్ అనౌన్స్ చేస్తున్న మేకర్స్, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఒక పోస్టర్ ని వదిలారు. మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకొని, సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న బ్యాక్ స్టిల్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైటిల్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ హీరో సినిమాకి…