Trivikram: సూపర్ స్టార్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్ అనే వీడియోని కూడా రిలీజ్ చేసారు. ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెడుతూ, సోషల్ మీడియాలో ఈ వీడియో సెన్సేషనల్ వ్యూస్ రాబడుతోంది.
SSMB 28 సినిమాకి గుంటూరు కారం టైటిల్ అనౌన్స్ చేస్తూ త్రివిక్రమ్ గత ఏడేళ్లుగా తను ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడు. త్రివిక్రమ్ సినిమా అనగానే ‘అ’ లేదా ‘ఆ’ అనే అక్షరంతో టైటిల్ ఉంటుందని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల కోసం త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి కానీ 2016 నుంచి మాత్రం ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయకుండా వస్తున్నాడు త్రివిక్రమ్. అందుకే SSMB 28 సినిమాకి కూడా ‘అ’ సెంటిమెంట్‌లో భాగంగా.. అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు… లాంటి టైటిల్ వినిపించాయి. అవేమి కాకుండా ‘గుంటూరు కారం’ టైటిల్ ని ఫైనల్ చేయడం విశేషం. అయితే త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అయినప్పుడు అజ్ఞాతవాసి మాత్రమే ఫ్లాప్ అయ్యింది. అతడు థియేటర్స్ లో ఆడకపోయినా కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. మరి గుంటూరు కారం విషయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే 2024 సంక్రాంతి వరకూఆగాల్సిందే.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!