Mahesh Babu: ఆ గడ్డ మహేష్ బాబు అడ్డా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి, ఆయన సినిమాలు క్రియేట్ చేసిన కలెక్షన్ల రికార్డుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, భరత్ అనే నేను సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు సృష్టించి, సర్కారు వారి పాట సినిమాతో ఓపెనింగ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు మహేష్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు కలెక్షన్ల ట్రాకింగ్ ఉన్న ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 వన్ మిలియన్ డాలర్స్ సినిమాలతో మహేశ్ బాబు తెలుగులో ఇతర హీరోలకి ఇప్పట్లో అందనంత దూరం మైంటైన్ చేస్తూ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. మహేష్ చేసిన 27 సినిమాల్లో ఈ ఫీట్ సాధించడం మాములు విషయం కాదు. అందుకే ఓవర్సీస్ గడ్డ మహేష్ బాబు అడ్డా అంటుంటారు ఘట్టమనేని అభిమానులు. మహేష్ తర్వాతి స్థానాల్లో తెలుగు నుంచి నాని, ఎన్టీఆర్ లు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
అసలు ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి మహేష్ బాబు టాగ్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అమెరికా మార్కెట్ లో అత్యధిక సార్లు 1 మిలియన్ డాలర్స్ రాబట్టిన హీరోల లిస్ట్ పోస్ట్ అయ్యింది. ఇందులో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 30 సార్లు, ఖిలాడీ అక్షయ్ కుమార్ 25 సార్లు, భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ 23 సార్లు, హ్రితిక్ రోషన్ 17 సార్లు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ 13 సార్లు, యాక్షన్ హీరో అజయ్ దేవగన్ 12 సార్లు వన్ మిలియన్ డాలర్స్ ని రాబట్టారు. ఈ లిస్టులో తెలుగు మాత్రమే కాదు మొత్తం సౌత్ నుంచి మహేష్ బాబు మాత్రమే ఉండడం విశేషం. లిస్టులో ఉన్న బాలీవుడ్ హీరోలందరూ కనీసం నలభైకి పైగా సినిమాలు చేసిన వాళ్లే, అతి తక్కువ సినిమాలు చేసింది మహేష్ బాబు మాత్రమే. SSMB 28, SSMB 29 సినిమాలతో మహేష్ తన ఓవర్సీస్ రికార్డులని మరింత స్ట్రాంగ్ చేసుకుంటాడు.
Also Read
Number of $1M Grossers in USA/CAN. pic.twitter.com/Nt7phbsyIc
— Nishit Shaw (@NishitShawHere) May 28, 2023
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!