SSMB 28: ఇది మహేష్ అభిమానులకి మాత్రమే దక్కిన అదృష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఒకటే టాగ్, ఒకటే ట్రెండ్ నడుస్తోంది… ‘ఎస్ఎస్ఎంబీ 28’. మే 31న టైటిల్ అనౌన్స్ చేస్తున్న మేకర్స్, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఒక పోస్టర్ ని వదిలారు. మహేష్ బాబు హెడ్ బ్యాండ్ కట్టుకొని, సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న బ్యాక్ స్టిల్ రిలీజ్ చేసారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ టైటిల్‌ను మే 31న రిలీజ్ చేయనున్నారు. అయితే ఏ హీరో సినిమాకి అయినా ఒక గెస్ట్ వచ్చి టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని, టీజర్ ని, ట్రైలర్ ని రిలీజ్ చేస్తాడు. ఒకవేళ స్టార్ హీరోస్ అయితే తమ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ని డైరెక్ట్ గా వాళ్లే రిలీజ్ చేసుకుంటారు. SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ విషయంలో మాత్రం మహేష్, త్రివిక్రమ్ అండ్ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా ఏ థియేటర్స్ లో ఆడుతుందో, ఆ థియేటర్స్ లోనే SSMB28 టైటిల్ అండ్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. థియేటర్స్ లో ఉన్న ఘట్టమనేని అభిమానులు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి SSMB 28 టైటిల్ ని రివీల్ చెయ్యనున్నారు. ఫాన్స్ రివీల్ చేసే వరకూ సోషల్ మీడియాలో SSMB 28 టైటిల్ ని మేకర్స్ రివీల్ చెయ్యట్లేదు. సో మహేష్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసే అవకాశం ఆయన ఫాన్స్ కే దక్కింది అనమాట. ఈ ఛాన్స్ కోసం అయినా మోసగాళ్లకు మోసగాడు సినిమా చూడడానికి ఘట్టమనేని ఫాన్స్ థియేటర్స్ కి పెద్ద సంఖ్యలో వెళ్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ వినిపిస్తోంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘! ⚡😎
SUPER FANS will unveil Striking video at the 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒!! 🤩🎥
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli… pic.twitter.com/l3VKLuyqWP
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!