హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ చేస్తే టేబుల్ ముందుకు రావడానికి కనీసం 10 నిమిషాల సమయమైనా పడుతుంది. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ సమయమైనా పట్టవచ్చు. కాకా హోటల్‌కి వెళ్లినా కావాల్సింది ఇవ్వడానికి రెండు మూడు నిమిషాల సమయం పడుతుంది. ఆర్డర్ చేసింది క్షణాల్లో టేబుల్ ముందుకు రావాలంటే కుదరని పని. అయితే, మెక్సికో లోని కర్నే గారిబాల్డీ అనే హోటల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ హోటల్‌లో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా క్షణాల్లోనే టేబుల్…
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు…
సాధారణంగా వెండితెరపై కనిపించే నటీనటులు రియల్ కాదు.. కానీ వారు రియల్ గా జంట ఎలా ఉండాలో చూపిస్తారు.. ఒక హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే ప్రేక్షకులు వారే రియల్ కపుల్ అన్నట్లు చూస్తారు. అలాంటివారు ఎన్నిసార్లు వెండితెరపై కనిపించినా బోర్ ఫీలవ్వరు. అయితే ఒకే హీరో ఒకే హీరోయిన్ తో పనిచేయాలంటే ఎంతో కష్టం అంటారు కొందరు.. మరికొందరు ఒకసారి పనిచేసాకా రెండో సరి ఆ బెరుకు పోతుంది.. ఫ్రీగా పనిచేసుకోవచ్చు…
వెలుగు లేకుంటే మనిషిని మనుగడ సాధ్యం కాదు. వెలుతురు ఉన్నప్పుడే అన్ని చక్కదిద్దుకుంటాం. సూర్యుడు ఉదయం సమయంలో మనకు వెలుగును ఇస్తాడు. మరి రాత్రి సమయంలో మనకు వెలుగు కావాలంటే… ఈ ఆలోచనే బల్బును కనుక్కునే విధంగా చేసింది. ఎలక్ట్రికల్ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. బయటకు వెళ్లాలంటే గతంలో టార్చిలైట్‌ను ఉపయోగిస్తారు. కెమెరాలో ఫ్లాష్ లైట్ ఉంటుంది. సాధారణంగా ఈ ఫ్లాష్ లైట్‌ను మాములు కళ్లతో చూడలేము. కాంతి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత…