ప్రముఖ రాజకీయ నాయకుడు, పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో కన్నడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ…
కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్న నాయకులను చూస్తున్నాం. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే…