గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపణలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయ్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయ్. గుజరాత్ డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది DRI. కేసులో ఇప్పటి వరకు 8 మందిని కటకటాల్లోకి నెట్టింది. వీరిలో నలుగురు అఫ్ఘాన్ దేశస్తులు, ముగ్గురు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. సుధాకర్ దంపతులతో పాటు మరో ఇద్దరిని చెన్నైలో పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. కాందహార్…