Guillain-Barre Syndrome: పూణేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను వణికిస్తున్న గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా ఒక యువకుడు మరణించాడు. ధయారి ప్రాంతంలో నివసిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) శనివారం సాయంత్రం షోలాపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. జనవరి 11న పూణేలో తొలిసారి బాధితుడు విరేచనాలతో బాధపడడ్డాడు. షోలాపూల్‌లోని తన స్వగ్రామనికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకు అతడి పరిస్థితి విషమించడంతో అక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజులు ఐసీయూలో చికిత్స పొందిన తర్వాత అతను మరణించాడు.
రోగికి గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. చికిత్స సమయంలో అతడి చేతులు, కాళ్లను కదపలేకపోయాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికర పరిస్థితుల కారణంగా అతడు మరణించాడు. జీబీఎస్ అనేది అరుదైన నరాల రుగ్మత. మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం వల్ల ఈ రుగ్మత ఏర్పడుతుంది. పూణేలో ఇటీవల కాలంలో 73 కేసులు నమోదయ్యాయి. వీరిలో 47 మంది పురుషులు కాగా, 26 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 14 మంది వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. కాంపిలోబాక్టర్ జెజుని, నోరో వైరస్ కారణంగా బాధితులకు వాంతులు, విరేకన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి బాధితులకు జీబీఎస్ అభివృద్ధి చెందడానికి ముందు ఈ లక్షణాలు కనిపించాయి.
ఈ వ్యాధికి చికిత్స లేదు. నరాల బలహీనం, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తయి. జీబీఎస్ లక్షణాలు కొన్ని వారాల పాటు ఉంటాయి. వ్యాధి తాలూకు లక్షణాలను నియంత్రించవచ్చు. కొంత మంది కొన్ని రోజుల్లో కోలుకుంటారు. అయితే, కొంతమందిలో మాత్రం లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. జీబీఎస్ తరుచుగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ల ద్వారా వస్తుంది. ఇది నరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మెదడు, వెన్నుపాము వెలుపల ఉన్న ఆరోగ్యకరమైన నరాలపై దాడి చేస్తుంది. ఇది బలహీనతకు, కొన్ని సార్లు పక్షవాతానికి, మరణానికి దారి తీస్తుంది.