SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..
- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం.
- అర్ధరాత్రి ఆందోళనకు దిగిన విద్యార్థులు
- బాలికల హాస్టల్ వాష్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SPY Camera in Engineering College womens Washrooms: సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే నిజంగా పరిస్థితి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భావించకుండా ఉండలేకపోతున్నాము. ఎక్కడో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూమ్మీద గౌరవంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం షాక్‌కు గురైంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయినా పరిస్థితి మారడం లేదు. ఈ ఘటన తర్వాత కూడా మహిళలపై హింస తగ్గడం లేదు, వేధింపులు తగ్గడం లేదు.
ఇకపోతే, తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. యూనివర్శిటీల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికల టాయిలెట్స్‌లో విద్యార్థులు రహస్య కెమెరాను కనుగొన్నారు. కొందరు దుండగులు మహిళల టాయిలెట్స్‌లో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఘటనపై వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే యాజమాన్యం స్పందించక పోవడంతో పాటు నిందితుడిని వెంటనే శిక్షించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఇలాంటి దారుణ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్ లో మాకు న్యాయం కావాలి అని నినాదాలు చేసారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. దీంతో మీడియాకు సమాచారం రాకుండా యూనివర్సిటీ గేట్లను మూసివేశారు.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిల నినాదాలు చేసారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నం చేసారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు. ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగిదింది హైడ్రామా. ఈ ఘటనలో ఫైనల్ ఇయర్ విద్యార్థికు, మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపనలు వినిపిస్తున్నాయి. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ. ‘ ఎక్స్ ‘ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను విద్యార్థినీలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!