తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తర్వాత కూడా అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఏపీలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.
Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు 13 మందిని సిట్ అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ బావ ప్రశాంత్ ను సిట్ అరెస్టు చేశారు. గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రశాంత్ కి వందకు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ విచారణలో వెల్లడి కావడంతో ప్రశాంత్ ను అదుపులో తీసుకున్నారు.
Tspsc పేపర్ లీక్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారి ఇది కాస్తా రాజకీయం పులుముకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరగడంతో తీవ్ర దుమారం రేపింది.
నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్వ్యూలో ఎంపికైన 165 మంది అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం నాడు వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 167 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా 165 పోస్టులను భర్తీ చేసింది. మరో రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది. Read Also: Driverless Car: ఐఐటీ హైదరాబాద్…
గ్రూప్ -1 పోస్టుల నోటిఫికేషన్ దరఖాస్తు గడువు నేటితో యుగియనుంది. వాస్తవానికి మే నెలాఖరుతో తుది గడువు ముగియగా.. అభ్యర్థులకు మరో అవకాశం కల్పించిన టీఎస్పీఎస్సీ జూన్ 4 వరకు అవకాశం కల్పించింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా, మే 31 నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ పేమెంట్, సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా.. అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్పీఎస్సీ గడువును నాలుగు రోజులు…
విజయవాడ రాజ్‌భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ అధికారుల వల్ల తాము భవిష్యత్ కోల్పోతున్నామని గవర్నర్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చడం వెనుక కారణమేంటని.. అధికారులు మారాక ఆచరణ, నిర్వహణ తీరు మారిపోయిందని ఆరోపించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచారని.. ఇప్పుడు 202 మందిని ఆ జాబితా నుంచి…
గ్రూప్-1 దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4 వరకు పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటించింది. వాస్తవానికి మంగళవారం రాత్రితో గడువు ముగిసినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఫీజుల చెల్లింపు విషయంలో సమస్యలు తలెత్తినట్టు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎవరూ నష్టపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్పీఎస్పీ వర్గాలు తెలిపాయి. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు…