గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 18 జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,48,881 మంది…
తెలంగాణలో గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కాసేపటి క్రితమే విడుదలైంది. కాగా.. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుండి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే లేదా జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష ఉండనుంది. అయితే.. ఇంతకు ముందు…
టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 563 పోస్ట్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ -1 రద్దు అయింది.
గ్రూప్-1 కు ప్రిపేరై సమయంలోపు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోయినవారికి ఏపీపీఎస్సీ ఊరట కలిగించే న్యూస్ చెప్పింది.. గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంచింది.. ఈ నెల 21వ తేదీతో దరఖాస్తుల గడువు ముగిసిపోగా.. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ ..
గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఫైనల్ కీని తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. తుది కీని టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత హోదాగా భావించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ ఎక్సామ్ స్టార్ట్ కానుంది.