భారత ఆటగాడు పృథ్వీ షాను ముంబై రంజీ టీమ్ నుంచి ముంబై క్రికెట్ అసోసియేషన్ తప్పించిన విషయం తెలిసిందే. ఫామ్, ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన పృథ్వీకి.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ చోటు లేకపోవడంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అతడికి అండగా నిలిచాడు. అథ్లెట్ల కెరీర్‌లో ఒడిదొడుకులు సహజమేనని, వాటికి ఎదురొడ్డి పోరాడాలని సూచన…