Air Quality: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. 107 విమాన సర్వీసులు ఆలస్యం..
- ఢిల్లీని కమ్మేసిన పొగమంచు..
- నేటి నుంచి జీఆర్‌ఏపీ-4 దశ ఆంక్షలు
- మూడు విమానాలు రద్దు.. మరో 107 విమానాలు ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగ మంచు రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో సమీప వాహనాలు కూడా కనిపించని దుస్థితి నెలకొంది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే, నగరంలో వాయునాణ్యత సూచీ 428కి చేరడంతో.. ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయబోతుంది.
Read Also: Prabhas Prashanth Varma : ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ.. పోస్టర్ కూడా రెడీ చేశాడట ?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇక, ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- 4 కింద మరిన్ని నిబంధనలను ఈరోజు (సోమవారం) ఉదయం 8గంటల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా ఇతర (భారీ) వాహనాలకు ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకే పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పింది. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించినప్పటికి.. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు దాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం ఆతిశీ వెల్లడించారు.
Read Also: Swara Bhasker: “బాలిక విద్యను వద్దన్న మౌలానాతో స్వరా భాస్కర్”.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..
అలాగే, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆఫీసులన్నీ 50శాతం ఆక్యూపెన్సీతో పని చేసేలా చూడాలని.. మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఏక్యూఎం సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని చెప్పుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!