తడిసిన ధాన్యం కొనాలి: చాడ వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం ప్రారంభించిందని దీని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ధాన్యం అంత తడిసిపోయిందని కొనుగోలు కేంద్రాల్లో కనీసం గన్నీ సంచులు, టార్ఫాలిన్లు కూడా ఇవ్వడం లేదని ఆయన ఫైర్ అయ్యారు.
నల్లగొండలో 626 కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి ఫలితం లేదు. ధాన్యం కొనుగోలుకు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నాగర్ కర్నూల్ జిల్లాలో తడిసిన ధాన్యాన్నికి మొలకలు వచ్చాయి. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులపై రాజకీయాలు మాని ధాన్యం కొనుగోలు చేయా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జాప్యం చేయకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
- Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!