ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి నెలకొంది. రేపు 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.