ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.
UPI: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు డిజిటల్ గా మారబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది.