యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఎర్రమంజిల్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు శ్రీనివాస్ మాధవ్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి పాల్గొన్నారు.
Bumper Offer : సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నానాటికి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కొత్త రకం పాలసీ తీసుకురానున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పింఛనుదారులకు పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఏ) చట్టం.. సకాలంలో ఉద్యోగులు, పింఛనుదారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులకు తెలంగాణప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం…
ఏపీలో పీఆర్సీ పై మండిపడుతున్న ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు తమ పట్టువీడాలని ప్రభుత్వం కోరుతూనే వుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు. ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి.. ఇలాంటి ఆందోళనలు మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు తల్లి లాంటిది.. ఉద్యోగులకు సీఎం జగన్ తప్పకుండా మేలు చేస్తారని ఆశాభావం వ్యక్తం…
ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది. బడ్జెట్-పీఆర్సీని సమన్వయం…
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై ఆయన స్పందించారు. 317జీవో తెచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఖాళీలను నింపి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు. Read Also: ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని…
ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిళ మద్దతు తెలిపారు. జీఓ317 రద్దు చేయాలని, జీఓ 317అంతా తప్పుల తడకగా ఉందని షర్మిళ అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఈ జీఓ స్థానికులనే స్థానికేతరులను చేసిందన్నారు. Read Also:విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మాదే: హరీష్‌రావు పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయతీ పెడుతున్నారని చెప్పారు.…
పీఆర్సీ అమలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై చర్చించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం ప్రభుత్వ నోడల్ అధికారిని నియమించింది. దీనికోసం ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ…