ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు సీఎస్ సమీర్ శర్మ. సీఎస్ తో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో వున్న ఆర్థికేతర అంశాలను తక్షణం పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన భేటీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఉద్యోగుల అర్ధికేతర సమస్యల పరిష్కారంపై ఇప్పటికే దృష్టి సారించింది ప్రభుత్వం. ఆర్దిక సమస్యలపై జాయింట్ స్టాఫ్…
రాష్ట్రంలోని చెక్కర కర్మాగారాల నిర్వాహణ , పునరుద్ధరణ అంశాలపై ఏపీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమయ్యారు. దీనికి కురసాల కన్నబాబు , బొత్స సత్యనారాయణ , మేకపాటి గౌతమ్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీల ఉద్యోగుల జీతాల బకాయిలపై ప్రత్యేకంగా చర్చించారు మంత్రులు. విజయదశమికి చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీలలోని ఉద్యోగుల జీతాల చెల్లింపులకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనలతో… పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను… బలవంతపు సెలవుపై పంపాలని నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ నిబంధన అమలుకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. ఆరోగ్య కారణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని…
కరోనా మహమ్మారి కలవర పెడుతూనే ఉంది.. ఎప్పుడు, ఎవరికి, ఎక్కడి నుంచి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకితే 20 రోజుల పాటు సెలవు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 15 రోజుల స్పెషల్ కాజువల్ లీవ్, 5 రోజులు కమ్యూటెడ్ సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.. కాగా, ఉద్యోగులకు…