తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిత్యం బిజీగా వుంటారు. అటు పాలనా వ్యవహారాల్లో బిజీగా వున్నా.. వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలంటారు. నల్లమలలో పర్యటించిన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అక్కడి గిరిజనులతో మమేకం అయ్యారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మరిచిపోలేను, ఎప్పటికీ మరిచిపోను అన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా…