Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా విశాఖ పర్యటనలోనే ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా నోవాటెల్ హోటల్‌లో పవన్ ఉండిపోయారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పార్టీ నేతలతో పలు మార్లు కీలకంగా మాట్లాడిన అనంతరం ఆయన సోమవారం మధ్యాహ్నం విశాఖ నుంచి విజయవాడ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన ప్రయాణించే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. హోటల్ వద్ద గుమికూడిన…
CJI NV Ramana: గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా డాక్టరేట్, మాస్టర్ డిగ్రీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో వీసీ పట్టాలు అందించారు. అటు సీజేఐ ఎన్వీ రమణకు నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గౌరవ డాక్టరేట్ పట్టాను జస్టిస్ ఎన్వీ రమణకు యూనివర్శిటీ ఛాన్సిలర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అందజేశారు.…
At Home in Raj Bhavan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు.…
తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 1,544 మందికి బీఎస్సీ, 328 మంది పీజీ, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పట్టాలను అందజేశారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రకటించారు. ఎన్.వి.రెడ్డి, ఎ.కె.సింగ్, ఆలపాటి సత్యనారాయణలకు జాతీయ…