At Home in Raj Bhavan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. అంతేకాకుండా పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
Read Also: Ex-serviceman collapses during flag hoisting: జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ కుప్పకూలిన మాజీ జవాన్
కాగా ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరు పేరున పలకరించారు. తానే స్వయంగా అతిథులు కూర్చున్న టేబుళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించారు. జాతీయ గీతాలాపనతో ఎట్ హోమ్ కార్యక్రమం షురూ అయింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ హాజరైనా ఒకరికొకరు ఎదురుపడలేదు. ప్రధాన టేబుల్ వద్ద సీఎం జగన్ దంపతులు, గవర్నర్ దంపతులు, హైకోర్టు సీజే పీకే మిశ్రా దంపతులు కూర్చోగా.. వేదిక ఎడమ వైపుటేబుల్ వద్ద చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, అశోక్‌బాబు కూర్చున్నారు.