ఏపీలో తరచూ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల యాన్యువల్ రిపోర్టులను గవర్నరుకు సమర్పించారు గౌతమ్ సవాంగ్. ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలని వివరించారు గౌతమ్ సవాంగ్. ఈసందర్భంగా గవర్నర్ పలు సూచనలు చేశారు. గ్రూప్-1 ఆభ్యర్థుల అభ్యంతరాలను గౌతమ్ సవాంగ్ వద్ద గవర్నర్ ప్రస్తావించినట్టు సమాచారం. అంతకుముందే గ్రూప్ వన్ అభ్యర్ధులు గవర్నర్…
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు…