గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉండి అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు.
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
‘రాష్ట్ర ప్రభుత్వం.. అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది..అయితే ఆ సంక్షేమఫలాలు అర్హులైన ప్రతి వ్యక్తికి అందేలా చూడాలి’ అని గవర్నర్ అన్నారు. ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలల్లో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ అకాంక్షించారు. అంతకుముందు గవర్నర్ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సేవల్ని కొనియాడారు. దేశ సమగ్రతకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన సేవలు మరువలేనివని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గవర్నర్ నివాళుర్పించారు. దేశ సమైక్యత కోసం పటేల్ అనిర్విరామంగా కృషి చేశారన్నారు. దేశ ప్రజల హృదయాల్లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశం కోసం ఆయన పడ్డ తపన ఈ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
తాజావార్తలు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!