నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల స్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. నెల్లూరు రూరల్ పరిధి బీవీ నగర్‌లోని కురుగొండ నాగిరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పాఠశాలలో ఇటీవల అదనపు తరగతుల కోసం భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం సాగుతున్న ప్రాంతం వద్ద విద్యార్థులు ఆడుకుంటుండగా... ఒక్కసారిగా స్లాబ్ కింద పడిందని.. దీంతో 9వ తరగతి చదువుతున్న గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందినట్టు చెబుతున్నారు.
Collector Shashanka:ప్రభుత్వ పాఠశాలలో చదువుకోనే జిల్లా కలెక్టర్ ను అయ్యాను అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. చదువు మాత్రమే జీవితంలో గొప్ప మార్పు తెస్తుందన్నారు.
Andhra Pradesh: నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలలను తీర్చిదిద్ది పౌరులుగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులది. ప్రభుత్వం సహకరిస్తే ఉపాధ్యాయులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని.. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసి ఖండాలు దాటించగలరని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ లోపల అడుగుపెట్టారు. వివరాలలోకి వెళ్తే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి అంతర్జాతీయ వేదికపై వివరించేందుకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల నుండి…
Head Master : విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. తమ దగ్గరికి విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులను లైగింకంగా వేధిస్తున్నారు.
Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామేనన్ తెలుగు రాష్ట్రంలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా మారిపోయింది. కాసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్. నిజంగానే జరిగిందీ సంఘటన. ప్రస్తుతం నిత్య ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే షూట్ పూర్తైన తర్వాత దగ్గర్లోని గవర్న్‌మెంట్ స్కూల్‌కు వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించి…
విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు రకరకాలు ప్రయత్నించడం సాధారణమే. పాఠశాలకు వచ్చిన అనంతరంబాగా చదివితే పెన్, నోట్స్ ఏదో ఒకటి బహుమతిగా ఇస్తామని చెబుతారు. మంచి మార్కులు తెచ్చుకున్న వారిని క్లాస్ రూమ్‌లో ప్రశంసించడంతోపాటు.. ప్రోత్సాహకంగా ఏదో గిఫ్ట్ ఇస్తారు. కానీ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థులకు ఏకంగా ఫ్లైట్, ట్రైన్, బస్ ప్రయాణాలు ఉచితంగా కల్పిస్తానని ఆఫర్ ఇచ్చారు.
తెలంగాణలో స్కూల్స్ రేషనలైజేషన్ పై విద్యాశాఖలో చర్చ నడుస్తోంది.. అయితే, హేతుబద్దీకరణ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. రేషనలైజేషన్ చేస్తే రాష్ట్రంలో 3 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు.. దీనిపై 2015-16లో హేతుబద్దీకరణ పై ప్రభుత్వం ఆలోచించినా.. మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. అయినా, పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పరిస్థితి మెరుపడలేదు.. రాష్ట్రంలోని 1243 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ దీనికి నిదర్శనం.. ఒక్క విద్యార్థి కూడా లేని వాటిలో…