విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు నర్సుల ఆందోళన చేస్తున్నారు. ప్లే కార్డులతో కోవిడ్ పేషేంట్స్ కు ఇబ్బంది లేకుండా, విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని,కాంట్రాట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ డ్యూటీ చేస్తూ కోవిడ్ వచ్చి 15 రోజులు సెలవలు పెడితే జీతం కట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదంటున్నారు నర్సులు.…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కంటిమీద నిద్ర లేకుండా చేస్తుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడడం కలకలంగా మారుతోంది.. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వెలుగుచూడగా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ తరహా కేసులు బయటపడ్డాయి.. తాజాగా.. ఖమ్మం జిల్లాలోనూ బ్లాక్ ఫంగస్ కేసు తీవ్ర కలకలంగా మారింది… మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో.. ఆప్రమత్తమైన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి…
కోవిడ్ రోగుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర చాలా కీలకమైనది.. ఆక్సిజన్ సరైన సమయం అందక.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు.. అయితే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ అయ్యింది.. దీంతో.. కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు రిస్క్‌లు పడ్డాయి.. మరోవైపు ఆక్సిజన్ లీకేజీని అరికట్టడానికి ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. దాదాపు గంటన్నర నుంచి అదుపులోకి రావడం లేదని చెబుతున్నారు.. ఇక, ఈ పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ హిమన్సు…