ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచకంగా.. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపడంపై యాంటీ టెర్రరిజం ఫోరం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
సీనియర్ పొలిటీషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూయడంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్.. అదే విధంగా.. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని నిర్ణయించంది… ఇక, రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా.. రంగారెడ్డి, హైదారబాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ…