కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో మూడు తప్పు ఉంటాయన్న ఆయన.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలని సూచించారు..
2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్ చేస్తున్నారు.. తాను 200 బిలియన్ డాలర్లు సహాయాన్ని ప్రతిజ్ఞ చేశారు.. ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.. 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం తాను 200 బిలియన్ల డాలర్ల సహాయం చేస్తానని పేర్కొన్న ఆయన.. తోటి బిలియనీర్లు కూడా తమ దాతృత్వ ప్రయత్నాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.