నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా సర్‌ప్రైజ్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమా నుంచి ‘అఖండ’ న్యూ పోస్టర్ విడుదల కాగా.. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా వుండనుందని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చిన్న వీడియోతో నందమూరి అభిమానులను…
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాను చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన…
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీస్ చేసిన బోయపాటి ఇప్పుడు ‘అఖండ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు.…
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడింది. అయితే సినిమా విడుదల వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని మేకర్స్ రీజన్స్ చెప్పారు. కానీ అసలు కారణం అది కాదట. సినిమా థియేట్రికల్ రైట్స్…
‘క్రాక్’ సినిమాతో అటు రవితేజకు ఇటు చిత్ర పరిశ్రమకు ఊపు తెచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్. కరోనా తర్వాత నిస్సత్తువగా సాగుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘క్రాక్’ గొప్ప ఊపిరి పోసింది. ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులను 50 శాతం ఆక్యుపెన్సీతో ఫుల్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో తెలుగు చిత్రపరిశ్రమదే ముందడుగు. ఈ రోజున 80 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే వాటికి ‘క్రాక్’ ఇచ్చిన భరోసానే కారణం. ఇక విషయానికి వస్తే…
తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు యాక్షన్ హీరో గోపీచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఆ సినిమాయే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో కనిపిస్తాడట. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తరువాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా…
మాచో హీరో గోపిచంద్, తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ డ్రామాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న గోపీచంద్ అభిమానులకు దర్శకుడు సంపత్ నంది ఒక అప్డేట్ ఇచ్చారు. ఆయన కూతురికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసిన సంపత్ నంది “సీటిమార్ రిలీజ్ ఎప్పుడు నాన్నా ?… ఇది…