సీటిమార్ : “జ్వాలారెడ్డి” సాంగ్ కు అనూహ్య రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘సీటిమార్’లోని ‘జ్వాలారెడ్డి’ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను, లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో తాజాగా 15+ మిలియన్ వ్యూస్ వచ్చినట్టు తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ‘జ్వాలారెడ్డి’ సాంగ్ ను శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించగా… కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న “జ్వాలారెడ్డి” లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!