Google: ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. గూగుల్ ఉద్యోగుల జీతం ఎక్సెల్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరంలో Google ఉద్యోగుల సగటు జీతం $ 2.79 లక్షలు అంటే భారతీయ కరెన్సీలో రూ. 2.3 కోట్లు.
Google introduces shop tab for rentals and purchases on Android TV: టెక్ దిగ్గజం ‘గూగుల్’.. కొత్త షాప్ ట్యాబ్‌ను పరిచయం చేసింది. షాప్ ట్యాబ్‌ను బుధవారం నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉన్న శీర్షికలను బ్రౌజ్ చేయడానికి ఈ షాప్ ట్యాబ్ వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఎస్‌లోని అన్ని…
Google AI: ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. అమెరికన్ టెక్ సంస్థ AI ద్వారా హెల్త్‌కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తోంది.
Oracle: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి
Google Lens: టెక్నాలజీ మరింతగా అప్డేట్ అవుతోంది. ప్రతీది అరచేతిలో ఇమిడిపోతోంది. ఒక్క సెల్ ఫోన్ మానవ మనుగడనే మార్చేసింది. మానవ జీవితాన్ని మరింత సుఖవంతంగా తయారు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక్క క్లిక్ ద్వారానే మీ చర్మ సమస్యలను గుర్తించవచ్చు.
వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సతమతమవుతుంది. హైబ్రిడ్ మోడల్ లో భాగంగా ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ ల నుంచి వర్క్ చేయాలని గూగుల్ కోరుతున్న పలువురు ఎంప్లయిస్ మాత్రం పట్టించుకోవడం లేదు.
Google: కోవిడ్ మహమ్మారి పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు దొరికింది. అయితే కోవిడ్ ప్రస్తుతం పోయినా కూడా కొందరు మాత్రం ఆఫీసులకు వెళ్లం, ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని చెబుతున్నారు. అలాంటి వారికి పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
Meta Layoffs: ఫేస్బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.
BT Group: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో యూకే టెలికాం దిగ్గజ సంస్థ బీటీ గ్రూప్ చేరింది. ఏకంగా 55,000 మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు 2030 నాటికి వరకు జరుగుతాయని వెల్లడించింది.