Google : గూగుల్ సంస్థ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేసింది. చాలా కాలంగా ఉపయోగించని అన్ని గూగుల్ ఖాతాలను త్వరలో క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
31 ఏళ్ల గూగుల్ ఉద్యోగి న్యూయార్క్లోని చెల్సియాలో గల ప్రధాన కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ గురువారం చెల్సియాలోని గూగుల్ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
IT Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఆర్థికమాంద్యం భయాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఐటీలో సంక్షోభానికి కారణం అవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను విసిరి అవతలపారేశాయి.
Morgan Stanley Layoff: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలతో పాటు అన్ని మల్టీనేషనల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ చేరేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ కూడా తన ఉద్యోగులను తొలగించే ప్లాన్ లో ఉంది.
గూగ్ల్ ప్లే స్టోర్లో కుప్పలుకుప్పలుగా యాప్స్ ఉంటాయి.. కొన్నిసార్లు.. ఇలాంటి యాప్లు కూడా ఉన్నాయా? అనే అనుమానాలను కలిగిస్తుంటాయి.. అయితే, ఎప్పటికప్పుడు గూగుల్.. వాటిని ప్రక్షాళన చేస్తూనే ఉంటుంది.. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరిపోతున్న విషయం విదితమే.. ఈ యాప్స్ వలలో చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, లోన్ యాప్స్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్.. మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న 3500 లోన్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి సెర్చింజన్…
Meta: ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయాలు తగ్గడంతో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ట్విట్టర్ ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే పలు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తున్నాయి.
More Layoffs in Google: టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు…
Google, Amazon layoffs: ప్రపంచంలోనే పేరుమోసిన దిగ్గజ కంపెనీలు సైతం గత కొన్ని రోజులుగా ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నాయి.. ఏ టెక్ సంస్థ దీనికి మినహాయింపు కాదు.. కొన్ని నెలల కాలంలోనే లక్షలాది మంది టెక్కీలు పింక్ స్లిప్స్ అందుకున్నారు.. తమ గోడును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. గూగుల్, అమెజాన్, మెటా ఇలా దాదాపు 570 టెక్ కంపెనీలు ఈ ఏడాది అంటే.. కేవలం మూడు నెలల కాలంలోనే 1.60 లక్షల మంది కంటే…