Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
Best Companies In US: డబ్బు విషయం పక్కపెడితే.. చేసే పనిలో ఇష్టం, మానసిక ప్రశాంతత ఉండాలని ప్రతీ ఉద్యోగి కోరుకుంటారు. అలాగే కోట్లు సంపాదించినా ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోలేము.
Penalty on Google: గూగుల్‌కు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లోనూ షాక్ తగిలింది.. ప్లేస్టోర్ విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్‌సీఎల్ఏటీ.. ఇప్పటికే విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందేనని స్పష్టం చేస ఇంది.. దీంతో, ఎన్‌సీఎల్‌ఏటీలో వారం రోజుల వ్యవధిలోనే గూగుల్‌కు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలినట్టు…
'హత్య చేయడం ఎలా' అని గూగుల్‌లో సెర్చ్ చేసి భార్యను హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు వికాస్, వారిని తప్పుదారి పట్టించడానికి దోపిడీ గురించి తప్పుడు సమాచారం అందించగా.. పోలీసులు అతని ఫోన్‌లో అతని ప్రియురాలితో పాటు నేరారోపణ చేసే సాక్ష్యాలను కనుగొన్నారు.
Google CEO Meets PM: భారత ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. సోమవారం ఇరువురు సమావేశం అయ్యారు. అందరికి ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్ కు మద్దతు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇరువురి మధ్య జీ-20 సమావేశంపై చర్చ జరిగింది. ఈ నెల మొదట్లో భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతను తీసుకుంది. ‘‘గూగుల్ ఫర్ ఇండియా’’ ఈవెంట్ కు హాజరుకావడానికి సుందర్ పిచాయ్ ఇండియాకు వచ్చారు.
FIFA World Cup Final Records Highest Search Traffic, Says Google's Sundar Pichai: ఫిఫా వరల్డ్ కప్ పుణ్యామా అని గూగుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇదే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ రికార్డ్ అని…
గూగుల్ జీమెయిల్ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ సర్వీసులు పనిచేయడం లేదని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్.. మంచి జీతం, కొత్త ఇల్లు.. ఏదైనా కొనగలిగే సమర్థత.. వాయిదాల పద్ధతి కూడా ఉండడంతో.. ఏ వస్తువునైనా కొనేసే ఆర్థికస్తోమత.. అయితే, ఇప్పుడు వారి పరిస్థితి తలకిందులుగా మారిపోయింది… ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల హెచ్చరికలతో చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించాయి..…
Amazon Plans To Sack 20,000 Employees: ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ద్రవ్యోల్భణం భయాల మధ్య పలు టెక్ కంపెనీలు వరసగా తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ట్విట్టర్ లో మొదలైన ఈ తొలగింపులు వరసగా కొనసాగుతున్నాయి. మైక్రోసాప్ట్, గూగుల్, అమెజాన్ ఇలా ప్రముఖ టెక్ దిగ్గజాలు అన్నీ కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. లాభాలు తగ్గడంతో ఖర్చులు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.