Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.
గూగుల్ కంపెనీలో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతెస్తారు.. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్ పార్లర్ లే కాదు.. తరుచుగా కంపెనీ లంచ్ లు కూడా ఉంటాయి.. అలాంటిది ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కంపెనీ కోత విధిస్తున్నాట్లు పేర్కొంది.
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి.
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో కనిపంచే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా షేక్ డేటానే పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ హోటల్ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లు యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు.
Indeed Layoff: అమెరికాకు చెందిన ప్రముఖ జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఇండీడ్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. టెక్ లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుతం కాలంలో తాము కూడా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ క్రిస్ హైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండీడ్ లో మొత్తం 14,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా అన్ని విభాగాల నుంచి కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
నకిలీ వెబ్‌సైట్లు నయాగా తయారు చేసి ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్‌లో నకిలీదే ముందు కనిపిస్తుంది.
గూగుల్ ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కి లేఖ రాశారు. గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్‌లో పనిచేసే 1400 మందికిపైగా ఉద్యోగులు.. పలు డిమాండ్లను సీఈఓ సుందర్ పిచాయ్ ముందు ఉంచారు.
Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు.
ఉత్తర కొరియాలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనను సాగిస్తున్నాడు. ఎంతలా అంటే.. ఆ దేశ ప్రజలు కనీసం ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోలేనంత.