Google Maps – Gemini AI: గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్, లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచేందుకు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని (Gemini)తో జత కట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టినట్టుగానే హ్యాండ్స్-ఫ్రీగా మ్యాప్స్‌తో మాట్లాడగలరు. అంతేకాకుండా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పుడు డ్రైవర్లు వాయిస్ కమాండ్‌లతోనే నావిగేషన్, సెర్చ్, ETA పంచుకోవడం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత సెర్చ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్‌లు జోడించడం వంటి…
చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఒక భారీ ప్రమాదం జరిగింది. రాజ్‌సమంద్ జిల్లాలోని గదరి వర్గానికి చెందిన ఒక కుటుంబం గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి తిరిగి వస్తుండగా బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. రష్మి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సోమి-ఉప్రెడా కల్వర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ కల్వర్టు మూడు సంవత్సరాలుగా మూసివేసి ఉంది.…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో గూగుల్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడిపించడంతో అది కాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మీదకి తీసుకుపోయింది. కాగా, కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లాడు.. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో.. కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది.
గూగుల్ మ్యాప్స్ ఒక తెలియని ప్రాంతానికి వెళ్లడానికి దారి తెలుసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో, ప్రయాణ ప్రణాళిక నుంచి దిశలు, ట్రాఫిక్ అప్ డేట్స్ తెలుసుకోవడం వరకు ప్రతిదానికీ సహాయపడే సాధనంగా గూగుల్ మ్యాప్స్ మారింది. గూగుల్ మ్యాప్స్ అనేది ఒక శక్తివంతమైన నావిగేషన్ సాధనం. ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోవాలన్నా లేదా హైదరాబాద్ నుంచి ముంబైకి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, Google Maps కొన్ని సెకన్లలో దూరం, సమయం, మార్గాన్ని తెలియజేస్తుంది.…
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని కొండల్లోకి లోడ్‌తో ఉన్న కంటైనర్‌తో వెళ్లిపోయాడు ఓ డ్రైవర్.. కర్ణాటక రాష్ట్రం నుండి తాడిపత్రికి ఐరన్ లోడుతో బయలుదేరింది కంటైనర్.. అయితే, రాత్రి సమయంలో దారి తెలియక గూగుల్ మ్యాప్‌ని ఆన్ చేశాడు డ్రైవర్ ఫరూక్.. ఇక, ఆ మ్యాప్‌ను ఫాలో అయిపోయాడు.. అది సరాసరి యాడికి మండలంలోని రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి తీసుకెళ్లింది.. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత లోయలోకి ఒరిగిపోయింది ఆ భారీ కంటైనర్..
రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా యానిమల్, పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి…
Google Maps: గూగుల్ మ్యాప్ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది.
GPS: ఇటీవల కాలంలో జీపీఎస్ గూగుల్ మ్యాప్స్ నమ్మి కొన్ని సార్లు ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు వాహనదారులు. కొన్ని సందర్భాల్లతో తప్పుడు రూట్లలోకి తీసుకెళ్లడం మూలంగా కొందరు ప్రయాణికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు.
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తనిఖీ చేయవచ్చు. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందనున్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణను అందరికీ సులభతరం చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఈ వారంలో 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Bengaluru Traffic: సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నగర ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన ట్రాఫిక్ కలిగిన నగరాల్లో ఒకటిగా ఉంది. ఒక్కసారి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటే, ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి ఉంటుంది. గంటల కొద్దీ వాహనాలు రోడ్లపైనే చిక్కుకుపోతుంటాయి. ఇక వర్షాకాలం ఈ ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువ.