భారతదేశంలో అనేక రకాల నూనెలను వంటలకు ఉపయోగిస్తారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, ఆవాల నూనె మొదలైన అనేక రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా ఆహారంలో నూనెను వాడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల నూనెలను వంటలో ఉపయోగించకూడదని అంటున్నారు. ఇందులో పామాయిల్ కూడా ఉంది. దీనిని ఉపయోగిస్తే గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.