ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభ వేళ.. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ ఇండియాలో ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. భారత్ లోనే ఐపీఎల్ 2024 నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని పేర్కొ్న్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని విషయాల పై…
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఓట్ల పండుగ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాయిలాలు ప్రకటించే ఛాన్సుందని సమాచారం. ముఖ్యంగా వాహనదారులకు శుభవార్త ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.