INDW vs SLW: తృటిలో త్రిష హాఫ్ సెంచరీ మిస్.. 12 పరుగులకే 5 వికెట్స్!
- మలేసియా వేదికగా అండర్-19 టీ20 ప్రపంచకప్
- కౌలాలంపూర్ వేదికగా శ్రీలంకతో భారత్ ఢీ
- 12 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయిన లంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలేసియా వేదికగా జరుగుతున్న అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో భారత అమ్మాయిలు దూసుకుపోతున్నారు. గ్రూప్-ఎలో ఉన్న భారత్.. వెస్టిండీస్, మలేసియా జట్లపై విజయం సాధించింది. నేడు కౌలాలంపూర్ వేదికగా శ్రీలంకతో తలపడవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టాన్ని 118 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 49 రన్స్ చేసి అవుట్ అయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మనుడి నానయక్కర బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కమలిని (5) నిరాశపర్చింది. సానికా చాల్కే డకౌట్ కాగా.. నికి ప్రసాద్ (11), భావికా అహిరే (7), ఆయుషి శుక్లా (5) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. ఈ సమయంలో త్రిష ఒంటరి పోరాటం చేసింది. మిథిలా వినోద్ (16), జోషిత (14), పరుణిక (1), షబ్నామ్ (2), వైష్ణవీ శర్మ (1) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లిమాంస తిలకరత్న, ప్రముది, అసెని తలో 2 వికెట్లు పడగొట్టారు.
Also Read
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు వరుస షాకులు తగులుతున్నాయి. 4.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయింది. షబ్నం ఎండీ షకీల్, జోషిత వీజీలు తలో రెండు వికెట్స్ పడగొట్టారు. సంజన కవింది (5), సుముడు నిసంసాల (0), దహమి సనేత్మా (2), హిరుణి హన్సిక (2) అవుట్ అయ్యారు. కెప్టెన్ మనుడి నానయక్కర రనౌత్ అయింది. ప్రస్తుతం క్రీజులో రష్మిక సెవ్వండి, లిమాన్స తిలకరత్నలు ఉన్నారు. లంక విజయానికి 89 బంతుల్లో 101 రన్స్ అవసరం. భారత్ హ్యాట్రిక్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!