Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10…
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.
అనంతపురం శివారులో రాజహంస విల్లాస్లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో రూ. 3.5 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. కూతురు వివాహం కోసం దాచి వుంచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి దాదాపు రూ. 20 లక్షలు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి. వివరాల ప్రకారం… హైదరాబాద్ బీఎన్ఆర్ జ్యుయలరీ నుంచి విజయవాడ డెలివరీకి వ్యాపారి కిషన్…
Robberies: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బిసి కాలనీలో దొంగలు మంగళవారం (డిసెంబర్ 31) అర్దరాత్రి బీభత్సం సృష్టించారు. జనసంచారం మధ్య జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. వరుసగా మూడు ఇళ్ళలో చోరీకి పాల్పడిన దుండగులు 25 గ్రాముల బంగారం, 38 వేల రూపాయల నగదు, ఓ మొబైల్ ను అపహరించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరి కూడా లేకపోవడం దొంగలకు సులభంగా పని…
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26).
బంగారం ధర రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు.. బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 35 సార్లు చేరుకుంది. దాని వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాది బంగారం ధర 33 శాతం పెరిగింది. బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతోందనేది ప్రశ్న.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.