బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. నేడు మరోసారి మరింత తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,124, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,280 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.92,800 వద్ద అమ్ముడవుతోంది.
Also Read:PM Modi: నేటి నుంచి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన అమల్లోకి.. యువతకు రూ. 15000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. దీంతో రూ. 1,01,240 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,390 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,26,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,16,100 వద్ద ట్రేడ్ అవుతోంది.