పెరుగుతున్న ఆర్థిక అస్థిరత, ట్రంప్ సుంకాల యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా శుభకార్యాల వేళ పసిడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి. నేడు సిల్వర్, గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తులం పుత్తడి ధర రూ. 800 తగ్గింది. కిలో వెండి ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,140, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,295 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 8000 తగ్గింది.
Also Read:US: ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గింది. దీంతో రూ.92,950 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 880 తగ్గింది. దీంతో రూ. 1,01,400 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,550 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,25,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది.