బంగారం ధర రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు.. బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 35 సార్లు చేరుకుంది. దాని వేగం ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ ఏడాది బంగారం ధర 33 శాతం పెరిగింది. బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతోందనేది ప్రశ్న.