Lucky draw: భార్య మాట విని ఓ వ్యక్తి ఏకంగా రూ.8 కోట్ల విలువైన లక్కీ డ్రాని గెలిచారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్య కోసం బంగారు గొలుసు కొనుగులు చేశారు. ఆ తర్వాత తీసిన లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. తన భార్య కోసం మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన గోల్డ్ చైన్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.