Today Business Headlines 03-05-23: భోగాపురానికి శంకుస్థాపన: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని 4 వేల 592 కోట్ల రూపాయల వ్యయంతో 2 వేల 203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
Flight Journeys: మన దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022లో 47 శాతానికి పైగా వృద్ధి సాధించాయి. దేశీయ విమాన ప్రయాణాల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. DGCA.. లేటెస్ట్‌గా వెల్లడించింది. 2022లో 12 కోట్ల 32 లక్షల 45 వేల మంది ఫ్లైట్లలో జర్నీ చేయగా 2021లో 8 కోట్ల 38 లక్షల 14 మంది మాత్రమే ప్రయాణించారు. 2022 నవంబర్ కన్నా డిసెంబర్‌లో 13 పాయింట్ ఆరు…