Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా…
Bandi Sanjay Kumar: గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు…
Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది.
Godavarikhani: రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గోదావరిఖని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం 5K రన్‌ను ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ శాంతి కపోతాలను ఎగరవేసి ఈ 5K రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతీ వాహనదారుడి సహకారం అవసరం అని అన్నారు. ప్రమాద రహిత కమిషనరేట్ గా…
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్,…
తనను అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లికి ఓ కూతురు వెరైటీ గిఫ్ట్ ఇచ్చింది. అయితే.. చిన్నప్పుడూ చందమామ రావే..జాబిల్లి రావే.. అంటూ తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన అమ్మకి చందమామపైనే స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది.
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్…
కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని డీసీపీ రవీందర్ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9 వేల నగదు, ఏటీఎం కార్డులు, కత్తి, బైక్ ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు చాకచక్యంగా చేధించిన వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్…