Godavari River: నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి ఒక్కసారిగా పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.4 అడుగుల వద్ద ఉన్నది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఇవాళ అధికారులు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూగో జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరిగిపోతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి ఉంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద వస్తుంది. అయితే గోదావరి వరద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే శబరి నదికి కూడా భారీగా వరద రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్ఘడ్-ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శబరి నదికి 28 అడుగులకి వరద చేరుకుంది. దీంతో.. గోదావరికి పోటు ఏర్పడుతుంది. గోదావరి నుంచి దిగువకి వెళ్లే నీటి వేగం స్తంభించింది. దీంతో ఇప్పటికే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు.
ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు