Godavari Floods: ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari Floods: తెలంగాణ రాష్ట్రంలో ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద వరద నీరు జ్ఞాన దీపాలను ముంచేయగా, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పూర్తిగా నిండుకుండలా మారింది. భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 9,02,550 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
Also Read
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 40 గేట్లు ఎత్తి, 2 లక్షల 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1 లక్ష 75 వేల క్యూసెక్కులు కాగా, నీటి మట్టం ప్రస్తుతం 1087.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. మొత్తం సామర్థ్యం 80.5 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 66.783 టీఎంసీలుగా ఉంది.
Samsung TV Plus: ఈటీవీ, శాంసంగ్ భాగస్వామ్యం.. శాంసంగ్ టీవీ ప్లస్‌లో ఈటీవీ ఛానెల్స్!
మరోవైపు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు వస్తోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి, 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 75 వేల క్యూసెక్కులు. ప్రస్తుతం నీటిమట్టం 1403.50 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు. మొత్తం నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 15.667 టీఎంసీలుగా ఉంది. ఈ వరదల కారణంగా ప్రాజెక్టులు వరుసగా నిండుకుండలా మారుతున్నాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!