సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పాలాభిషేకం నిర్వహించారు.
ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి. ఇటీవల చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి అంజిరెడ్డి రూ.20 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు.